అంగారపర్ణుఁడు ఎవరు? అతను చిత్రరధుడుగా ఎందుకు మారాడు?
Wednesday, February 14, 2007
ఇతడు ఒక గంధర్వుడు. కుబేరుని మిత్రుడు. ద్రుపద నగరానికి పోతున్న పాండవుల పాదముల చప్పుడు విని "ఎవరు మీరు? ఈ అర్ధ రాత్రి ఈ అడవిలో తిరుగుతున్నారు? ఈ అడవి, గంగానది అంగారపర్ణుడవని తెలియదా అని కేకలు వేసెను. ఈ నదిలో ఎవరు స్నానము చేస్తారో వారిది కానీ, నీది ఎలా అవుతుంది? నీవు వద్దంటే ఈ అడవిలో ప్రవేశించకూడదా? అని అర్జునుడు సమాధానమిచ్చాడు.
అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడి పై బాణాలతో దాడి ప్రారంభించాడు. వారిద్దరికి జరిగిన యుద్ధములో అర్జునుడు అతనిని ఓడించి జుత్తు పట్టుకుని యీడ్చుకుంటూ ధర్మరాజు దగ్గరకు తెచ్చి పడేసాడు. అప్పుడు అతని భార్య నాకు పతి దానమిమ్మని ధర్మరాజుని వేడుకున్నది. అపుడు ధర్మరాజు జాలిపడి అతనిని వదిలి వేసాడు.
అర్జునుడి పరాక్రమానికి అచ్చెరువొందిన అంగారపర్ణుడు, అతనిని స్నేహితుడిగా స్వీకరించి "జాక్షుషి" అనే గంధర్వ విద్య నేర్పి కొన్ని గంధర్వ అశ్వాలను ఇచ్చాడు.
అర్జునుని బాణాలకు తన రధం ఆహుతి అయిన కారణంగా రత్నయుతమైన సొంత రధాన్ని తయారు చేసుకొని "చిత్రరధుడు" అని పేరు మార్చుకున్నాడు.
అదండీ సంగతి !

2 Comments:
నేను అసలు ఈ పేరే ఎప్పుడూ వినలేదు.మీ పుణ్యమా అని పురాణాలు తెలుసుకుంటున్నాను.
commented by రాధిక, February 17, 2007 at 3:59 AM
ఘోరంగా దెబ్బతిన్నాక జ్ఞానోదయమై స్నేహం పెంచుకొని, పేరు మార్చుకొని కొత్తజీవితం ప్రారంభించాడన్నమాట.