<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

దధీచి

Monday, February 26, 2007

ఈ పేరుతో ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఋషి చ్యవనమహర్షి కుమారుడు. (అధర్వుని పుత్రుడని కొన్ని పురాణాలు పేర్కొంటాయి.) ఇంద్రుడు ఇతనికి కొన్ని విద్యలు నేర్పి ఇతను మాత్రం ఆ విద్యలను ఎవరికీ చెప్పరాదని నియమం పెట్టాడు. ఆ నియమం పెట్టాక అతడెవరికైనా చెప్తేనే కదా కథ ముందుకు కదిలేది? ఆ చెప్పించుకున్నవాళ్ళు అశ్వినీ దేవతలు. దాంతో ఇంద్రుడి శాపం వల్ల ఇతడి తల తెగిపోయింది. ఎవరి కారణంగా అతడి తల తెగిందో ఆ అశ్వినీ దేవతలే అశ్వశిరస్సును తెచ్చి అతికిస్తారు. ఐతే కథ అంతటితో ఐపోలేదు. ఇంద్రుడు ఆ తలను మళ్ళీ తొలగించడంతో ఈసారి అసలు తలనే తెచ్చి అతికిస్తారు.

అతడు సరస్వతీనది తీరంలో తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు. యథాప్రకారం ఇంద్రుడు బెదిరిపోయి అలంబుస అనే అప్సరసను పంపిస్తాడు. ఆమెను చూసి ఈయనకు వీర్యస్ఖలనమౌతుంది. అది వెళ్ళి సరస్వతినదిలో పడుతుంది. దాన్నుంచి సారస్వతుడు పుడతాడు. అతని వల్ల అనావృష్టి భయం నివారణ అవుతుందని దధీచి చెబుతాడు. దధీచి దక్షయజ్ఞం నాశనం చేసినట్లు కూడా ఒక కథ ఉంది.

ఇక అసలు కథ:

ఒకసారి దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతలకు అంతుచిక్కని విద్య నేర్చుకుని దాని సాయంతో దేవతల ఆయుధాలను తస్కరించడం మొదలుపెట్టారు. దాంతో దిక్కుతోచని దేవతలు అప్పటికి రాక్షసులను ఎదిరించలేమని తెలుసుకుని వాళ్ళకు చిక్కకుండా పారిపోతూ పోతూ దధీచి దగ్గరకు వచ్చి తమ ఆయుధాలను దాచి ఉంచమని, తాము తర్వాత వచ్చి తీసుకుంటామని కోరారు. అందుకు ఒప్పుకున్న దధీచి మహర్షి అప్పటి నుంచి తన జపతపాదులను కూడా పక్కన పెట్టి ఆ ఆయుధాలను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాడు. కానీ దేవతలు ఎంతకాలానికీ తిరిగి రాకపోవడంతో వాటినేం చేసుకోవాలో తోచక కాల్చి బూడిదచేసి నీళ్ళలో కలుపుకుని తాగేస్తాడు. ఆ తర్వాత దేవతలు ఈయన దగ్గరకు వచ్చి తమ ఆయుధాలిమ్మని అడుగుతారు. అవి ఎప్పుడో జీర్ణమైపోయి తన ఎముకల్లో కలిసిపోయాయని, చేతనైతే తీసుకొమ్మని అంటాడు దధీచి. సజీవుడై ఉన్న అతని ఎముకలను తీసుకోవడం ఎలా? అని అడగడంతో అతను ఏ మాత్రం తొణక్కుండా యోగాగ్ని సృష్టించుకుని దగ్ధమౌతాడు. దేవతలు ఆ ఎముకలనుంచి ఆయుధాలు తీసుకుంటారు. అతని వెన్నెముక నుంచి ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుంది. వెనకా ముందాడకుండా తన ప్రాణాలను, శరీరాన్ని ఇచ్చేసిన త్యాగశీలిగా దధీచి పేరుపొందాడు. ఇతని భార్య లోపాముద్ర. పుత్రుడు పిప్పలాదుడు.

ఋగ్వేదంలో ఇతని పేరు దధ్యంగుడు. ఇతనికి మధువిద్య తెలుసు. ఇంద్రుడు ప్రవర్గవిద్యను (బలి ఇచ్చినవాటికి తిరిగి తల అతికించడం) బోధిస్తాడు. అప్పుడే అశ్వినీదేవతలు ఆ విద్యను నేర్చుకుని గుర్రం తల తగిలిస్తారు. ఈ మునికే దధ్యాకుడనే పేరు కూడా ఉంది.

ఈయనే కాకుండా దితి, కశ్యపుల సంతానంలో కూడా ఒక దధీచి ఉన్నాడు.

Labels:

posted by త్రివిక్రమ్ Trivikram, 11:37 PM | link | 4 comments |

రావణుడితో యుద్ధం చేసిన మొదటి రాజు

Sunday, February 18, 2007

రావణుడు అందరు రాజులపైకి యుద్ఢానికి వెళ్తుండేవాడు. అతనిని చూసి అందరు రాజులు భయపడుతూ వుండేవారు. కానీ అనరణ్యుడు అనే రాజు మాత్రం రావణుడితో ఘోర యుద్ధం చేసాడు. ఓడి పోయాడు. రావణుడు అతడిని హేళన చేస్తూ తల ఖండించాడు. అపుడు ఆ తల "ఇది నీ ప్రతాపం కాదు, చేయించే వాడు భగవంతుడు. కాలం కలిసిరాక కూలిపోయాను. మా వంశమున పుట్టే రాముడనే వాడు నిన్ను సంహరిస్తాడు" అని శపించింది. రావణుడు ఆ తలను వేయి ముక్కలు చేసాడు.

Labels: ,

posted by Sudhakar, 11:22 PM | link | 3 comments |

అధశ్శిరస్సు

లంచం పుచ్చుకునే వారు అనుభవించే నరకాన్ని అధశ్శిరస్సు అంటారు

-బ్రహ్మ వైవర్త పురాణం.

Labels:

posted by Sudhakar, 11:17 PM | link | 0 comments |

మత్స్యగంధి పుట్టు పూర్వోత్తరాలు

Saturday, February 17, 2007

మత్స్యగంధి పేరు మీరు వినే వుంటారు. ఈమె పరాశరుని ద్వారా మహా భారత ప్రయోక్త వ్యాసుడికి జన్మనిచ్చిన తల్లి. భీష్ముని తండ్రి శంతనుని వివాహమాడి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులను కన్నది. ఈ విచిత్ర వీర్యుని భార్యలే అంబిక, అంబాలికలు. అతడు సంతానం లేక చనిపోతే మహాభారతానికి మూల స్థంభాలయిన దృతరాష్టుడు, పాండు రాజులను వ్యాసుని ద్వారా, అంబిక, అంబాలికల కడుపున పుట్టించిన ఘనత కూడా ఈమెదే.

అయితే ఈమెకు మత్స్యగంధి అని ఎందుకు పేరు వచ్చింది?

ఈమె అసలు పేరు అచ్ఛోదము. ఒక కొలను. సోమకులనే వారి మానస పుత్రిక. తండ్రులను చాలా కాలం చూడకుండా వుండటం వలన ఆమెకు చూడాలనే ఉబలాటం ఎక్కువగా వుండేది. ఒక నాడు అమావసుడు అనే అతను తన భార్య అద్రికతో కలసి విమానంలో అటు వైపు వచ్చాడు. వారే తన తల్లి తండ్రులనుకొని అచ్ఛోదము ఉవ్వెత్తున పైకి ఎగిసింది. ఇలాంటి తెలివి తక్కువ పని వలన పాపవశాత్తు ఆమె క్రింద పడబోయింది. అప్పుడు ఆమె తన తల్లి తండ్రులను ప్రార్ధించింది. అపుడు వారు "నీకు భయము లేదు, భూమిపై పడవు. కానీ కార్య ఫలము అనుభవించక తప్పదు. వారినే తల్లి తండ్రులుగా భావించావు కనుక , వారి నందే పుడతావు" అని అభయమిచ్చారు.

అందువలన ఆమె తిరిగి అద్రిక (ఈమె పొరపాటున ఒక ముని పాదమును తొక్కి, బ్రహ్మ శాపము వలన ఒక మత్స్యముగా పుట్టింది) కడుపులో పుట్టి పరాశరుడిచ్చిన వరము చేత యోజనముల వరకూ వ్యాపింపగల శరీర సౌగంధమును పొంది "మత్స్య గంధి" అని ప్రఖ్యాతి పొందింది. (గంధవతి, యోజనవతి, సత్యవతి అనేవి కూడా ఈమె పేర్లే).

-బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మ పురాణం

Labels: , , , , ,

posted by Sudhakar, 10:30 AM | link | 3 comments |

అక్ష హృదయము

అక్ష హృదయం అనేది ఒక విద్య. ఈ విద్య వచ్చిన వాడు సంఖ్యా కోవిదుడు అవుతాడు. కళంక విముక్తుడవుతాడు. ఋతుపర్ణుడికి ఈ విద్య వచ్చు. దీని వలన లెక్క పెట్టకయే ఒక చెట్టు ఆకులు, కాయలు ఎన్ని ఉన్నవో అతడు చెప్పగలడు. దానిని అతడు చాలా మందికి ఉపదేశించాడు. ఈ విద్య నేర్చిన తరువాతే నలునిలో ఉన్న కలి బయటకు వచ్చేసాడు.

Labels: , ,

posted by Sudhakar, 10:00 AM | link | 10 comments |

అంగారకుడి కధ

Friday, February 16, 2007

నవ గ్రహాలలో ఒకడు అని మనకు తెలిసినదే. అయితే ఇతడి పుట్టు పూర్వోత్తరాలు చూద్దాం.

బ్రహ్మ వైవర్త పురాణం : భూదేవి విష్ణుమూర్తిని మోహించి స్త్రీ రూపం తో తనను మోహించమని కోరింది. అందుకు అనుగ్రహించిన విష్ణువు భూదేవి పై ఒక బీజమును వేసాడు. అందునుంచి పుట్టిన వాడే అంగారకుడు.

పద్మ పురాణం : ఒక సారి విష్ణువు యొక్క స్వేద బిందువు ఒక భూమి మీద పడింది. అందులో నుంచి లోహితాంగుడు అనే ఒక పురుషుడు జన్మించాడు. అతడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గ్రహముగా మారాడు. అతడే మన ఎర్రని అంగారకుడు.

మరొకొన్ని పురాణాలు : దాక్షాయణిని బాసిన విరహంతో శివుడు చింతలో ఉండగా అతని శరీరం నుంచి ఒక స్వేద బిందువు ఒకటి భూమి మీద పడింది. దాని నుంచి లోహితాంగుడు అనే కుమారుడు పుట్టాడు. అతనిని పుత్ర భావమున భూదేవి కూడా పుత్రునిగా స్వీకరించింది. ఇతడే అంగారకుడు

Labels: , , ,

posted by Sudhakar, 9:59 AM | link | 6 comments |

అంగారపర్ణుఁడు ఎవరు? అతను చిత్రరధుడుగా ఎందుకు మారాడు?

Wednesday, February 14, 2007

ఇతడు ఒక గంధర్వుడు. కుబేరుని మిత్రుడు. ద్రుపద నగరానికి పోతున్న పాండవుల పాదముల చప్పుడు విని "ఎవరు మీరు? ఈ అర్ధ రాత్రి ఈ అడవిలో తిరుగుతున్నారు? ఈ అడవి, గంగానది అంగారపర్ణుడవని తెలియదా అని కేకలు వేసెను. ఈ నదిలో ఎవరు స్నానము చేస్తారో వారిది కానీ, నీది ఎలా అవుతుంది? నీవు వద్దంటే ఈ అడవిలో ప్రవేశించకూడదా? అని అర్జునుడు సమాధానమిచ్చాడు.

అప్పుడు అంగారపర్ణుడు అర్జునుడి పై బాణాలతో దాడి ప్రారంభించాడు. వారిద్దరికి జరిగిన యుద్ధములో అర్జునుడు అతనిని ఓడించి జుత్తు పట్టుకుని యీడ్చుకుంటూ ధర్మరాజు దగ్గరకు తెచ్చి పడేసాడు. అప్పుడు అతని భార్య నాకు పతి దానమిమ్మని ధర్మరాజుని వేడుకున్నది. అపుడు ధర్మరాజు జాలిపడి అతనిని వదిలి వేసాడు.

అర్జునుడి పరాక్రమానికి అచ్చెరువొందిన అంగారపర్ణుడు, అతనిని స్నేహితుడిగా స్వీకరించి "జాక్షుషి" అనే గంధర్వ విద్య నేర్పి కొన్ని గంధర్వ అశ్వాలను ఇచ్చాడు.

అర్జునుని బాణాలకు తన రధం ఆహుతి అయిన కారణంగా రత్నయుతమైన సొంత రధాన్ని తయారు చేసుకొని "చిత్రరధుడు" అని పేరు మార్చుకున్నాడు.

అదండీ సంగతి !

Labels: ,

posted by Sudhakar, 9:20 PM | link | 2 comments |