<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

దధీచి

Monday, February 26, 2007

ఈ పేరుతో ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఋషి చ్యవనమహర్షి కుమారుడు. (అధర్వుని పుత్రుడని కొన్ని పురాణాలు పేర్కొంటాయి.) ఇంద్రుడు ఇతనికి కొన్ని విద్యలు నేర్పి ఇతను మాత్రం ఆ విద్యలను ఎవరికీ చెప్పరాదని నియమం పెట్టాడు. ఆ నియమం పెట్టాక అతడెవరికైనా చెప్తేనే కదా కథ ముందుకు కదిలేది? ఆ చెప్పించుకున్నవాళ్ళు అశ్వినీ దేవతలు. దాంతో ఇంద్రుడి శాపం వల్ల ఇతడి తల తెగిపోయింది. ఎవరి కారణంగా అతడి తల తెగిందో ఆ అశ్వినీ దేవతలే అశ్వశిరస్సును తెచ్చి అతికిస్తారు. ఐతే కథ అంతటితో ఐపోలేదు. ఇంద్రుడు ఆ తలను మళ్ళీ తొలగించడంతో ఈసారి అసలు తలనే తెచ్చి అతికిస్తారు.

అతడు సరస్వతీనది తీరంలో తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు. యథాప్రకారం ఇంద్రుడు బెదిరిపోయి అలంబుస అనే అప్సరసను పంపిస్తాడు. ఆమెను చూసి ఈయనకు వీర్యస్ఖలనమౌతుంది. అది వెళ్ళి సరస్వతినదిలో పడుతుంది. దాన్నుంచి సారస్వతుడు పుడతాడు. అతని వల్ల అనావృష్టి భయం నివారణ అవుతుందని దధీచి చెబుతాడు. దధీచి దక్షయజ్ఞం నాశనం చేసినట్లు కూడా ఒక కథ ఉంది.

ఇక అసలు కథ:

ఒకసారి దేవదానవుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు దేవతలకు అంతుచిక్కని విద్య నేర్చుకుని దాని సాయంతో దేవతల ఆయుధాలను తస్కరించడం మొదలుపెట్టారు. దాంతో దిక్కుతోచని దేవతలు అప్పటికి రాక్షసులను ఎదిరించలేమని తెలుసుకుని వాళ్ళకు చిక్కకుండా పారిపోతూ పోతూ దధీచి దగ్గరకు వచ్చి తమ ఆయుధాలను దాచి ఉంచమని, తాము తర్వాత వచ్చి తీసుకుంటామని కోరారు. అందుకు ఒప్పుకున్న దధీచి మహర్షి అప్పటి నుంచి తన జపతపాదులను కూడా పక్కన పెట్టి ఆ ఆయుధాలను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాడు. కానీ దేవతలు ఎంతకాలానికీ తిరిగి రాకపోవడంతో వాటినేం చేసుకోవాలో తోచక కాల్చి బూడిదచేసి నీళ్ళలో కలుపుకుని తాగేస్తాడు. ఆ తర్వాత దేవతలు ఈయన దగ్గరకు వచ్చి తమ ఆయుధాలిమ్మని అడుగుతారు. అవి ఎప్పుడో జీర్ణమైపోయి తన ఎముకల్లో కలిసిపోయాయని, చేతనైతే తీసుకొమ్మని అంటాడు దధీచి. సజీవుడై ఉన్న అతని ఎముకలను తీసుకోవడం ఎలా? అని అడగడంతో అతను ఏ మాత్రం తొణక్కుండా యోగాగ్ని సృష్టించుకుని దగ్ధమౌతాడు. దేవతలు ఆ ఎముకలనుంచి ఆయుధాలు తీసుకుంటారు. అతని వెన్నెముక నుంచి ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుంది. వెనకా ముందాడకుండా తన ప్రాణాలను, శరీరాన్ని ఇచ్చేసిన త్యాగశీలిగా దధీచి పేరుపొందాడు. ఇతని భార్య లోపాముద్ర. పుత్రుడు పిప్పలాదుడు.

ఋగ్వేదంలో ఇతని పేరు దధ్యంగుడు. ఇతనికి మధువిద్య తెలుసు. ఇంద్రుడు ప్రవర్గవిద్యను (బలి ఇచ్చినవాటికి తిరిగి తల అతికించడం) బోధిస్తాడు. అప్పుడే అశ్వినీదేవతలు ఆ విద్యను నేర్చుకుని గుర్రం తల తగిలిస్తారు. ఈ మునికే దధ్యాకుడనే పేరు కూడా ఉంది.

ఈయనే కాకుండా దితి, కశ్యపుల సంతానంలో కూడా ఒక దధీచి ఉన్నాడు.

Labels:

posted by త్రివిక్రమ్ Trivikram, 11:37 PM

4 Comments:

"ఆమెను చూసి ఈయనకు వీర్యస్ఖలనమౌతుంది."
మరీ ఇలా బాహాటంగా చెప్పేస్తే ఎలాగండీ? :)
"ఆయన చెమట బిందువు నదిలో పడింది." ఇలా చెప్పాలి.
(బాగా చెప్పారు ఉత్తినే తమాషాకు అన్నాలెండి.)
--ప్రసాద్
http://blog.charasala.com
లోపాముద్ర వశిష్ఠ మహాముని భార్య కదండి?
ధధీచి మహర్షి వెన్నెముక ఉపయోగపడింది వృతాసురుడు అనే రాక్షసుని సంహరించడనికి కదా?
ఈ కింది లంకెలు చూడండి - http://en.wikipedia.org/wiki/Lopamudra
http://www.dadhich.com/dadhichi_rishi.htm
http://kids.swaminarayan.org/storytime/dadhichi.htm
http://en.wikipedia.org/wiki/Dadhichi

రాజేంద్ర ఆలపాటి
తప్పు రాసినందుకు క్షమించండి.
లొపాముద్ర అగస్త్య మహాముని భార్య.
ఈ కింది లంకె చూడండి - http://en.wikipedia.org/wiki/Lopamudra
రాజేంద్ర గారూ! అసలు కథ లోని సందర్భం వృత్రాసుర సంహారమని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. ఎక్కువమందికి తెలిసిన లోపాముద్ర అగస్త్యుడి భార్యే ఐనా మన పురాణాల్లో మరికొంతమంది లోపాముద్రలున్నారండీ! వాళ్ళ గురించి త్వరలోనే రాస్తాను. మంచి లింకులిచ్చినందుకు మరొక్కసారి థ్యాంక్స్!

Add a comment