రావణుడితో యుద్ధం చేసిన మొదటి రాజు
Sunday, February 18, 2007
రావణుడు అందరు రాజులపైకి యుద్ఢానికి వెళ్తుండేవాడు. అతనిని చూసి అందరు రాజులు భయపడుతూ వుండేవారు. కానీ అనరణ్యుడు అనే రాజు మాత్రం రావణుడితో ఘోర యుద్ధం చేసాడు. ఓడి పోయాడు. రావణుడు అతడిని హేళన చేస్తూ తల ఖండించాడు. అపుడు ఆ తల "ఇది నీ ప్రతాపం కాదు, చేయించే వాడు భగవంతుడు. కాలం కలిసిరాక కూలిపోయాను. మా వంశమున పుట్టే రాముడనే వాడు నిన్ను సంహరిస్తాడు" అని శపించింది. రావణుడు ఆ తలను వేయి ముక్కలు చేసాడు.
3 Comments:
ఈ జగన్నాటకం చాలా బాగుందండి. ఇలా మాకు ఇంకా ఎన్నో పాత్రలు మాకు పరిచయం చెయ్యాలి.
commented by Unknown, February 19, 2007 at 12:34 AM
మీరు పంచిపెడుతున్న ఈ పురాణ గుళికలు భలే వున్నై.
మంచి ఆలోచన.
మంచి ఆలోచన.
informative !