మత్స్యగంధి పుట్టు పూర్వోత్తరాలు
Saturday, February 17, 2007
మత్స్యగంధి పేరు మీరు వినే వుంటారు. ఈమె పరాశరుని ద్వారా మహా భారత ప్రయోక్త వ్యాసుడికి జన్మనిచ్చిన తల్లి. భీష్ముని తండ్రి శంతనుని వివాహమాడి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులను కన్నది. ఈ విచిత్ర వీర్యుని భార్యలే అంబిక, అంబాలికలు. అతడు సంతానం లేక చనిపోతే మహాభారతానికి మూల స్థంభాలయిన దృతరాష్టుడు, పాండు రాజులను వ్యాసుని ద్వారా, అంబిక, అంబాలికల కడుపున పుట్టించిన ఘనత కూడా ఈమెదే.
అయితే ఈమెకు మత్స్యగంధి అని ఎందుకు పేరు వచ్చింది?
ఈమె అసలు పేరు అచ్ఛోదము. ఒక కొలను. సోమకులనే వారి మానస పుత్రిక. తండ్రులను చాలా కాలం చూడకుండా వుండటం వలన ఆమెకు చూడాలనే ఉబలాటం ఎక్కువగా వుండేది. ఒక నాడు అమావసుడు అనే అతను తన భార్య అద్రికతో కలసి విమానంలో అటు వైపు వచ్చాడు. వారే తన తల్లి తండ్రులనుకొని అచ్ఛోదము ఉవ్వెత్తున పైకి ఎగిసింది. ఇలాంటి తెలివి తక్కువ పని వలన పాపవశాత్తు ఆమె క్రింద పడబోయింది. అప్పుడు ఆమె తన తల్లి తండ్రులను ప్రార్ధించింది. అపుడు వారు "నీకు భయము లేదు, భూమిపై పడవు. కానీ కార్య ఫలము అనుభవించక తప్పదు. వారినే తల్లి తండ్రులుగా భావించావు కనుక , వారి నందే పుడతావు" అని అభయమిచ్చారు.
అందువలన ఆమె తిరిగి అద్రిక (ఈమె పొరపాటున ఒక ముని పాదమును తొక్కి, బ్రహ్మ శాపము వలన ఒక మత్స్యముగా పుట్టింది) కడుపులో పుట్టి పరాశరుడిచ్చిన వరము చేత యోజనముల వరకూ వ్యాపింపగల శరీర సౌగంధమును పొంది "మత్స్య గంధి" అని ప్రఖ్యాతి పొందింది. (గంధవతి, యోజనవతి, సత్యవతి అనేవి కూడా ఈమె పేర్లే).
-బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మ పురాణం

3 Comments:
commented by Anonymous, February 18, 2007 at 9:50 AM
కాదు. నా దగ్గర ఒక పురాతన పుస్తకం "పూర్వ గాధాలహరి" అని ఒకటుంది. అదే ఈ కధలకు ఆధారం.కానీ మీరు ఇచ్చిన ఈ లంకెలో కధ వేరేగా వుంది. అచ్ఛోదం అమావసుని తన తండ్రిగా భావించింది. అందువల్లనే ఆమె అతని భార్య అద్రి (మత్స్యం) కడుపులో జన్మించింది. ఆమెను జాలరులు పెంచుకున్నారు.
బావుంది.అలా చూస్తే మహాభారతంలో కౌరవులు,పాండవులకు తాత వ్యాసుడైతే.ముత్తవ్వ ఈ మత్స్యగంధి అన్నమాట!ముత్తాత పరాశరుడు!
ఇక్కడ మత్స్యగంధి పుట్టుపూర్వోత్తరాలన్నారు గానీ ఆమె ఎలా పుట్టిందో చెప్పలేదు...వసురాజనే రాజుగారు అడవికి వేటకు వెళ్లి అక్కడ శృంగారభావనలతో వచ్చిన వీర్యాన్ని ఒక ఆకులో పెట్టి తన భార్యకు ఓ పావురం ద్వారా పంపితే అది జారిపడి నదిలో ఉన్న చేప(అద్రిక) మింగి దానివల్ల గర్భం ధరించి మన మత్స్యగంధిని, మత్స్యరాజును కంటుంది.
చిన్నప్పుడు చదివిన భాగవతం/భారతం?లో ఈ విషయం బాగా గుర్తుండిపోయింది.తప్పైతే సరిదిద్దగలరు. అన్నట్టు చేప సంగతి పక్కన పెడితే ఇది మనం ప్రస్తుతం వినియోగిస్తున్న 'కృత్రిమ గర్భధారణ'(Artificial Insemination)లా లేదూ!

http://www.maganti.org/PDFdocs/amavasyaperu.pdf