అంగారకుడి కధ
Friday, February 16, 2007
నవ గ్రహాలలో ఒకడు అని మనకు తెలిసినదే. అయితే ఇతడి పుట్టు పూర్వోత్తరాలు చూద్దాం.
బ్రహ్మ వైవర్త పురాణం : భూదేవి విష్ణుమూర్తిని మోహించి స్త్రీ రూపం తో తనను మోహించమని కోరింది. అందుకు అనుగ్రహించిన విష్ణువు భూదేవి పై ఒక బీజమును వేసాడు. అందునుంచి పుట్టిన వాడే అంగారకుడు.
పద్మ పురాణం : ఒక సారి విష్ణువు యొక్క స్వేద బిందువు ఒక భూమి మీద పడింది. అందులో నుంచి లోహితాంగుడు అనే ఒక పురుషుడు జన్మించాడు. అతడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గ్రహముగా మారాడు. అతడే మన ఎర్రని అంగారకుడు.
మరొకొన్ని పురాణాలు : దాక్షాయణిని బాసిన విరహంతో శివుడు చింతలో ఉండగా అతని శరీరం నుంచి ఒక స్వేద బిందువు ఒకటి భూమి మీద పడింది. దాని నుంచి లోహితాంగుడు అనే కుమారుడు పుట్టాడు. అతనిని పుత్ర భావమున భూదేవి కూడా పుత్రునిగా స్వీకరించింది. ఇతడే అంగారకుడు

6 Comments:
commented by తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం, February 16, 2007 at 9:45 PM
ఇది అంగారకుడి "అసలు కథ" అంటే దీన్నెవరూ ఒప్పుకోరనుకుంటా. శీర్షిక మార్చివుంటే బాగుండేదని నేననుకొంటున్నాను.

అవును నిజమే...మార్చ బడినది ప్రభూ :-)
ఎవరక్కడ!?
మారిస్తే బాగుంటుందన్నాంగానీ ఏమని మార్చాలో మాకు తట్టలేదు. అంగారకుడి కథ - బాగుబాగు.

మీ ప్రభువులంతా అంతే ప్రభూ :-)
commented by February 18, 2007 at 12:57 PM
,
అలాగే పక్షులూ పాములూ కూడా రాకాసి బల్లుల నుంచే ఉద్భవించాయని ఈమధ్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన పురాణాల ప్రకారం ఆ రెండింటికీ కశ్యప ప్రజాపతే తండ్రి.తల్లులు మాత్రం వేరు.పాముల తల్లి కద్రువ.(పక్షుల తల్లి వినత) ఈ సంగతి నేనొక కుఱ్ఱవాడితో చెబితే "అయితే అంకుల్ ! కశ్యప ప్రజాపతి అంటే నిజానికి ఒక డైనోసార్ అయివుంటాడా ?"అని కొంటె ప్రశ్న వేశాడు.
పాల సముద్రాన్ని మథించినప్పుడు ముందు హాలాహలమూ తరువాత అమృతమూ పుట్టుకొచ్చాయంటున్నాయి మన పురాణాలు. అభివృద్ధి అనే క్షీర సాగర మథనంలో ముందు కాలుష్యమే ఉద్భవిస్తుందని సూచిస్తోందేమో ఈ కథ ! తెలీదు.
పురాణ కథల్ని కొట్టి పారెయ్యడానికి లేదు.అలా అని వాటిలోని సందేశాన్ని యథాతథంగా తీసుకోవడానికి కూడా లేదు.