<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

భారతంలో గాంధారం

Wednesday, March 5, 2008

చిన్నప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి తరచూ "కుండకా1! కుశలమేనా?" అని సంబోధించి ఎగతాళి చేసేవాడట. ఉడుకుబోతైన భీముడు చాలా రోజులు ఊరుకున్నా ఒకసారి మాత్రం తిరగబడి "కుశలమే గోళకా2!" అని ఘాటుగా సమాధానమివ్వడంతో దిమ్మతిరిగిపోయిన దుర్యోధనుడు అప్పుడేమీ మాట్లాడలేక ఊరుకున్నా అసలు తను గోళకుడెందుకయ్యాడా అని ఇన్వెస్టిగేట్ చేయిస్తాడు. (నేను చిన్నప్పుడు బాలమిత్రలో చదివిన ఈ కథ ఇంతవరకూ కల్పితమేమో గానీ ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్లుగా చెప్తున్నది మాత్రం భారతంలో ఉన్న కథే:) గాంధారదేశానికి (ఇప్పటి ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతం) రాజైన సుబలుడికి కూతురు (గాంధారి) పుట్టగానే ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు "ఆమె జాతకంలో వైధవ్యయోగముంది" అని చెప్పారు. దాంతో ఆ యోగాన్ని తప్పించడానికి ఆమెకు యుక్తవయస్సు రాగానే ముందు రహస్యంగా ఒక మేకపోతుతో పెళ్ళి జరిపించి, వెంటనే దాన్ని చంపేసి ఆమెను శాస్త్రోక్తంగా విధవను చేశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని దాచిపెట్టి దూరదేశాన ఉన్న కురువంశానికి చెందిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్ళి చేసి పంపేశారు. అలా కౌరవులు విధవాపుత్రులన్నమాట.

ఈ విషయం తెలియగానే తన తాత కురువంశాన్ని మోసం చేశాడని మండిపడ్డ దుర్యోధనుడు తాత, మేనమామలను భూగృహంలో బందీలుగా చేసి, రోజుకు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు మాత్రమే ఆహారంగా అందివ్వమంటాడు. (సరిగా గుర్తులేదుగానీ సుబలుడికి కూడా వందో, ఇంకా ఎక్కువమందో ఉన్నారు కొడుకులు.) అలా ఐతే నిజంగానే అందరమూ అన్యాయంగా చచ్చిపోతామని గ్రహించిన సుబలుడు ఆ మెతుకులన్నీ శకుని ఒక్కణ్ణే తినమని, తను చచ్చిపోయాక మహిమగల తన అస్థికల సాయంతో దుర్యోధనుడి మీద పగతీర్చుకోమని చెప్తాడు. అలా వారిలో శకుని ఒక్కడే బతికి బయటపడి దుర్యోధనుడికి నమ్మకం కలిగించి కృష్ణుడి అండ ఉండే పాండవుల మీదికి అతణ్ణి రెచ్చగొట్టి అతడి పతనానికి కారకుడయ్యాడు. బహుశా మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడికి ప్రియదర్శినిలో శకుని కనిపించింది ఇందుకేనేమో? జరాసంధుడి తర్వాత దుర్యోధనుడే కదా కృష్ణుడి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది? మిగతావాళ్ళను కృష్ణుడు స్వయంగా నిర్మూలించగలిగాడు గానీ వీళ్ళిద్దరి విషయంలోనే పాండవుల సాయం అవసరమైంది.

1. కుండకుడు = bastard!
2. గోళకుడు = విధవాపుత్రుడు

Labels: ,

posted by త్రివిక్రమ్ Trivikram, 1:50 PM

6 Comments:

బాగా రాశారు. అయితే ఇది మూల భారతంలో ఉన్న కథ కాదు. ప్రచారంలో ఉన్న కట్టు కథ మాత్రమే. కృష్ణుడు ఆధిపత్యాన్ని కాంక్షించాడు, దుర్యోధనుణ్ణీ, జరాసంధుణ్ణీ పాండవుల్ని ఉపయోగించి అడ్డు తొలగించుకున్నాడు అనడం అన్యాయం. మాయాబజార్ కూడా కట్టుకథే అన్న మాట మీకు తెలిసి ఉండకపోవచ్చు. భారతాన్ని గురించి ఉదాత్తమైన రచనలెన్నో ఉన్నాయి. చదవడానికి ప్రయత్నించండి.
commented by Anonymous Anonymous, March 5, 2008 at 3:09 PM  
థ్యాంక్యూ!
మహాభారతాన్ని చారిత్రక దృష్టితో చదివితే ఒకరకంగానూ, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇంకొకరకంగానూ బోధపడుతుంది.
కృష్ణ బలరాములకు, జరాసంధుడికి మధ్య 18 సార్లు యుద్ధం జరగడం, ఒక్కసారైనా వాళ్ళు జరాసంధుణ్ణి జయించలేకపోవడం, ఒకసారి జరాసంధుడి ధాటికి తట్టుకోలేక కృష్ణ బలరాములు పారిపోవడం కట్టుకథలు కావు కదా? కృష్ణుడు తనను వ్యతిరేకించినవాళ్ళలో శిశుపాల, కంసాదులను స్వయంగా నిర్మూలించగలిగాడు. జరాసంధ, దుర్యోధనులను అలా చేయలేకపోయాడు. ఆధిపత్యం కారణం కాకపోతే జరాసంధ, దుర్యోధనాదులు ప్రజాకంటకులనడానికి ఎటువంటి ఆధారమూ లేదే? మాయాబజార్ కట్టుకథే కానీ అందులో ప్రధాన పాత్రల విషయంలో పాత్రౌచిత్యం చెడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో ఎవరికీ అంతుచిక్కకుండా కృష్ణుడన్న ఆ ఒక్కమాట ఈ కథ రాస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చి రాశానే తప్ప అది కల్పితమని తెలియక కాదు. (ఇదే కారణమని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేదు. "బహుశా...ఏమో" అనే రాశాను.) భారతాన్ని గురించి ఉన్న ఉదాత్తమైన రచనల పేర్లిస్తే తప్పక చదువుతాను.
పురాణాల గురించి నేను రాస్తున్న మరో బ్లాగును కూడా చదివి మీ అభిప్రాయం తప్పక తెలియజేయండి. ధన్యవాదాలు.
త్రివిక్రమ్,
మీరు చెప్పిన గాంధారి వైధ్యవ్యం కథ నిజంగానే వ్యాసభారతంలో ఉందా? నాకు తెలిసీ, ఆంధ్రభారతంలోనైతే లేదు. రామారావు శ్రీకృష్ణపాండవీయం సినిమాలో మూలభారతంలోలేని కథ ఆధారంగా ఆ సినామా తీసాడని కొంతమంది చెప్పగా విన్నాను.
కాని, మీరు ఇది భారతంలో ఉందంటున్నారు, అనుమాన నివృత్తి చెయ్యమని ప్రార్ధన :-)
చీర్స్,
నాగరాజు
trivikram^ gaariki,mii abhipraaaltO EkIbhavistunnaanu.bhagavaMtunigaa aaraadhiMchE vyaktulalOni ,lOpaalanu aaTTE paTTiMchukOmru,krIstu ,raamuDu(taaTaki,vaali)aMdarU! ii bhaavana "lOka kaLyaaNamu"kai! kaavuna,upExa vahistaaru.
"ginniis^ rikaarDu"nu miMchina rikaarDunu, sRjana chEyaali.aMta goppa udgrNdhaanni ,varamugaa
osagina Srii vEda vyaasula vaariki manameMtO RNa paDi unnaamu.idi garva kaaraNamugaa,prati saarii, uTaMkistuu,rachananu praraMbhiMcha valenu.
chaaritraka dRkpadhamutO vraasETappuDu, vaastava kONaalanu vismariMchaDamu asaadhyamu kadaa!
itihaasa, chaaritraka dRkkONAlu reMDuu avasaramainavE!!!
commented by Anonymous Anonymous, September 19, 2008 at 11:41 AM  
కృష్ణుడు స్వయంగా నిర్మూలించగలిగాడు గానీ వీళ్ళిద్దరి విషయంలోనే పాండవుల సాయం అవసరమైంది!!!

I think you are misleaded into this.

He could have killed anyone including Jarasandha. But bheema had a role to play in his cosmic drama.

He is the supreme being!

Regarding your question, I would suggest to read vyasa Bharatam available in telugu. True translation without any inferences. Then may be you can read pothana bhagavatam in telugu.
commented by Anonymous Anonymous, June 16, 2011 at 11:10 PM  
ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు చంపాలో లేదా శిక్షించాలో, లేదా ఏమి చేయాలో ఎలా చేస్తే వారు అంతమవుతారో శ్రీకృష్ణుడి కి అన్ని తెలుసు. అందుకే శిక్ష వేసేవారికి శిక్ష చంపే వారిని చంపి, తప్పించు కుపోయేకాడ తప్పించుకు పోయాడు.
శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి.

Add a comment