బంగారు ముంగిస
Wednesday, May 2, 2007
ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్ధుడి సంరక్షణలో సమస్త భూమండలాన్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తు చేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేధయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు అజాతశత్రుణ్ణీ ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికి కోటివేల బంగారునాణాలను ఇచ్చి తన రాజ్యమంతటిని వేదవ్యాస మహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.కాని ఆ ముని తనకు భూమి అక్కర్లేదు బంగారమిమ్మనెను. ఆ భూమికి వెలకట్టి బంగారం ఇచ్చి భూమిని ఉంచుకొమ్మనెను. అప్పుడు ధర్మజుడు " స్వామీ! అశ్వమేధయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే మీకు దక్షిణగా ఇచ్చాను.అది తిరిగి తీసుకుంటానా" అనెను."కాని మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది.ఇందులో ఏ దోషము లేదు తీసుకో" అనెను వ్యాసమహాముని.
అంత ధర్మరాజు కోటికోట్ల మాడలు కుప్పగా పోసి "ఇది నా భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు.ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు,వస్త్రాలు,తోరణాలను అందరికి పిలిచి పిలిచి దానం చేసాడు ధర్మరాజు. ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనే లేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు.సిద్ధులూ, విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.
తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు.యగ్ణానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు,ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగా సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే అప్పుడొక చిత్రం జరిగింది.
ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటికి వచ్చి "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం
మరీ అంతగా మెచ్చాలా? సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేధయాగం?!" అంటూ మూతి విరిచింది.
అప్పుడు విప్రులు ’ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?’ అని ప్రశ్నించారు. "అయ్యా! ఆకలిని, తృష్ణను
జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతి త్యజించి
సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావురంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యలు చేసి 'ఆరగించండి స్వామీ ' అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండిని భక్తితో సమర్పించారు. నాటి అతని దాన దక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణీమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు.అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నా తలా శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి. ఇదీ ఆ సక్తుప్రస్ఫుని ధర్మమహిమ!!
"మిగిలిన శరీరం కూడా బంగరుమయం చేసుకుందామని ఎన్ని యజ్ణప్రదే్శాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకు తారసపడలేదు. ఈనాడు అజాతశత్రుడు యాగంలో నైనా నా కోరిక తీరకపోతుందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోలదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనపడకుండా మాయమయింది.

4 Comments:
commented by spandana, May 2, 2007 at 6:26 PM
కడుపు నిండిన వాడికి పంచభక్ష్య పరమాన్న్నాలు పెట్టటం కన్నా ఆకలిగొన్న వారికి పచ్చడి ముద్ద పెట్టటమే గొప్ప అని చక్కగా చెప్పారు.
-నేనుసైతం
-నేనుసైతం
commented by May 2, 2007 at 8:35 PM
,
yaj~naaniki Dabbulu arjunuDu ekkaDanuMDO frIgaa teccinaTTu gurtu
అవును గుర్రంతో పాటు అర్జునుడు వివిధ దేశాల రాజులను ఓడించి వారి దగ్గరినుండి ఎంతో ధనాన్ని తీసుకొచ్చాడు.
"ఋత్విజులకు ఒక్కొక్కరికి కోటివేల బంగారునాణాలను..."
" రాజ్యమంతటిని వేదవ్యాస మహామునికి ..."
"ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు" -- మిగతా వాళ్ళు అంటే యాగానికి వచ్చిన వాళ్ళేనా అయితే ఆ తర్వాత "ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనే లేరు." అన్నారు గనుక అక్కడా బీదా, బిక్కీ, కూలివాడు, రైతూ వుండే సమస్యే లేదు.
"యగ్ణానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు,ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగా సత్కరించాడు"
సమస్త సామాన్య ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన ప్రజా ధనాన్ని ఈ "ధర్మ"రాజు ఇలా ఒలకబోస్తే "దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు" -- దానాల వల్ల సమస్త ప్రజలూ ఎలా తృప్తి పొందారో!
ఇన్నిలోటులుంటే ఈ యాగం సక్తుప్రస్ఫుడు దానంతో ఎలా సరితూగుతుంది?
--ప్రసాద్
http://blog.charasala.com