ఋక్ష విరుజుడు
Monday, April 16, 2007
ఇతడొక ఆదిమ వానరుడు. కాంచన పర్వతములో మధ్య శిఖరము పైన కూర్చుని బ్రహ్మ తపస్సు చేసుకుంటూ వుండగా అతని కంటి నుంచి కన్నీరు కారినది. వాటిని బ్రహ్మ దోసిలిలో పట్టగా దాని నుంచి ఋక్ష విరుజుడు పుట్టాడు. అతనిని ఆ అడవులలో సంచరిస్తూ, ఫలములు వంటివి ఆరగిస్తూ తిరగమని చెప్పాడు.
ఒక నాడు ఋక్షవిజుడు అలా తిరుగుతూ వుండగా ఒక కొలనులో తన ప్రతిబింబము చూసి, మరొక వానరుడనుకొని అందులో దిగాడు. భ్రమ తొలిగిన తరువాత బయటకు రాగా ఒక స్త్రీగా మారిపోయాడు. సాయింకాలము తిరిగి వస్తున్న సూర్యుడూ, బ్రహ్మను దర్శించుకుని వస్తున్న ఇంద్రుడూ ఆమెను మోహించారు. సూర్యుని కాంతి పడి సుగ్రీవుడు పుట్టగా, ఇంద్రుని వలన వాలి పుట్టాడు.
మరుసటి రోజు ఋక్షవిరుజుడు తన నిజ రూపాన్ని పొందాడు
ఈ విచిత్ర పరిణితులకు అతడాశ్చర్య పడి తండ్రి అయిన బ్రహ్మను కారణం అడిగాడు. అప్పుడు బ్రహ్మ, ఆ కొలనులో పూర్వం పార్వతి స్నానం చేస్తుండగా కొందరు రాక్షసులు స్త్రీ రూపం ధరించి అందులో దిగగా, అది గ్రహించిన ఆమె ఆ కొలనులో దిగిన ఏ పురుషునికైనా స్త్రీ రూపం ప్రాప్తిస్తుందనీ, అది ఒక రోజు వుంటుందనీ శాపమిచ్చినదనీ తెలిపాడు.
తరువాత, బ్రహ్మ, ఋక్షవిరుజుడిని కిష్కింధకు పోయి రాజ్యమును పరిపాలించమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఋక్ష విరుజుడు తన కుమారులిద్దరినీ వెంట తీసుకుని కిష్కింధ చేరుకుని కొంతకాలం పరిపాలించిన తరువాత, పెద్ద కుమారుడైన వాలికి రాజ్యమప్పగించి తపోవనములకు పోయాడు.