<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

సేవకా వృత్తి

Thursday, September 27, 2007

దుర్యోధనుడితో చేసుకున్న ఒప్పందం ప్రకరం పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం చేసె పన్నెండు నెలలు తామెవరో ఎవరికీ తెలియకుండా గడపాలి.

ఆ ప్రకారం పన్నెండేళ్ళూ అరణ్యవాసం పూర్తిచేసి అజ్ఞాతవాసానికి బయలుదేరబోతుంటే పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ధర్మరాజును సమీపించి ఇలా పలికాడు.

"నాయనలారా! మీరు వివేకవంతులు.మంచి చెడూ తారతమ్యం తెలిసినవారు. ధైర్యంగా ఉండి ఇకముందు చేయవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించండి . అన్ని రోజులు ఒకేలా ఉండవు. కష్టనష్టాలు ఎవరికైనా తప్పవు.మీకు సర్వశుభాలు కలుగుతాయి." అని దీవించాడు.

పాండవులు అతడికి పాదాభివందనం చేసి, ’మత్స్యదేశం ’ తమ అజ్ఞాతవాసానికి అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆ దేశాన్ని విరాటరాజు పరిపాలి్స్తున్నాడు. అతనికి పాండవులంటే ఇష్టం. గొప్ప బలశాలి, ధర్మ ప్రవర్తన కలిగినవాడు, వయసులో పెద్దవాడు. అందువల్ల విరాట రాజు కొలువులో తలదాచుకొని అజ్ఞాతవాసం చేయాలని పాండవులు నిర్ణయించుకున్నారు.

విరాటరాజు ఆస్థానంలో రాజోద్యోగి కంకుభట్టుగా ధర్మరాజు, వలలుడు అనే వంటవాడిగా భీమసేనుడు, అంతఃపుర స్త్రీలకు సేవ చేసి నవ్వించే నపుంసకుడిగా బృహన్నల వేషంలో అర్జునుడు, దామగ్రంధి అనే పేరుతో గుర్రపుశాలలో సేవకుడిగా నకులుడు, తంత్రిపాలుడు పేరుతో పశువుల కాపరిగా సహదేవుడు, అంతఃపురంలో పనిచేసే పరిచారిక సైరంధ్రిగా ద్రౌపది పని చేయడానికి నిశ్చయించుకున్నారు.

అప్పుడు ధౌమ్యులవారు వారిని ఆశీర్వదించి సేవకావృత్తిలో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్పారు. ఎవరికైనా, ఏనాటికైనా అందరికీ పనికివచ్చే మంచి మాటలు.

"రాజుగారి దగ్గర పనిచేయడానికి కుదిరేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు. రాజుగారి మనస్సు తెలుసుకుని పరిచర్యలు చెయ్యాలి. అడిగినప్పుడే సలహా ఇవ్వాలి. అడగనిదే ఏదీ చెప్పకూడదు. సమయం చూసి ఏలికను పొగడుతూ వుండాలి.

ఏ చిన్న పని చేసినా రాజుగారితో చెప్పి చెయ్యాలి. ప్రభువు నిప్పు లాంటివాడు. మితిమీరిన స్నేహం పనికిరాదు. అదేమని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎంతో నమ్మకంతో అధికారమిచ్చి, ఎంత చనువుగా మాట్లాడినా, ఎప్పటికప్పుడే పని నుండి తొలగించవచ్చునని భయభక్తులతో మెలగాలి. అధినేత అనుగ్రహం వుంది కదా అని అతను కూర్చునే ఆసనం మీద కానీ, రథం మీద కానీ, ప్రయాణం చేసే వాహనం మీద కానీ ముందే ఎక్కు కూర్చోకూడదు. రాజుగారి దగ్గర పని చేసేవాడు సోమరి కాకూడదు. రాజువల్ల గౌరవం పొందినా, అగౌరవం పొందినా ఆ సంతోషం కాని, సంతాపం కాని కనిపించకూడదు.
రహస్యాలు బయటకు పొక్కనీయకూడదు. ప్రజల వద్దనుంచి లంచాలు పుచ్చుకోరాదు. తోటి ఉద్యోగుల్ని చూసి అసూయపడకూడదు. రాజు ఒక్కోమారు తెలివిగలవాళ్ళనీ, బుద్ధిమంతుల్ని వదిలేసి మూఢుల్ని, తెలివితక్కువవాళ్ళని పెద్ద పెద్ద పదవులలో నియమించవచ్చు. అది చూసి బాధపడకూడదు. అంతపురాంగనలతో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళతో స్నేహం మంచిదికాదు." అని ధౌమ్యుడు రాజసేవకుల కష్టసుఖాలు తెలియజెప్పి దీవించి పంపాడు.

పెద్దవాళ్ళ దగ్గర ఎలా మసలుకోవాలో వ్యాసుల వారు ఈ కథ ద్వారా మనకు తెలియజేసారు.

Labels:

posted by జ్యోతి, 6:58 PM | link | 4 comments |