శూర్పణఖ
Sunday, April 8, 2007
శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరబాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు 'తెలియక తప్పు జరిగిపోయిందని' ఓదార్చి, మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. జనస్థానంలో ఆమె విహరిస్తూ ఉంటుంది.
ఆమెకు పుట్టిన కొడుకు జంబుకుమారుడు. వాడు తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని పగతీర్చుకునేందుకు తపస్సు చెయ్యటానికని వెళ్తాడు. తపస్సు చేస్తున్నవాడి చుట్టూ వెదురుపొద గుబురుగా పెరుగుతుంది. ఈ పొద పంచవటికి సమీపంలోనే ఉంటుంది. అరణ్యవాసంలో అన్నావదినలకు తోడుగా వచ్చిన లక్ష్మణుడు ఫలాల కోసం వెతుకుతూ అటువైపు వస్తాడు. అప్పుడు అక్కడి మునులు ఆ వెదురు పొదను నరకమని అతడికి చెప్తారు. లక్ష్మణుడు పొదను నరకగానే దాంతో బాటు జంబుకుమారుడి తల తెగిపోతుంది. చచ్చినవాడు రాక్షసుడు కాబట్టి విచారించవద్దని మునులు లక్ష్మణుడికి చెప్తారు. తన కొడుకు అకాలమరణం గురించి తెలుసుకున్న శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరి వెళ్తుంది. కానీ రాముడి సుందరరూపాన్ని చూసి మోహిస్తుంది.
అంటే సీతారామలక్ష్మణులు శూర్పణఖ కంటబడడం కాకతాళీయంగా జరిగింది కాదన్నమాట. ఆమే వాళ్ళను వెతుక్కుంటూ వచ్చింది. దాంతో కథ ఆ తర్వాత తిరగవలసిన మలుపులన్నీ చకచకా తిరిగేసింది!