కర్ణుడి తొడను తొలచిన కీటకం ఎవరబ్బా?
Friday, March 2, 2007
పరశురాముడు కర్ణుడి తొడ మీద నిద్ర పోతుండగా ఒక కీటకం అతడి తొడని తొలవటం తెలిసిందే కదా? కర్ణుడికి వున్న సవాలక్ష శాపాలలో ఒకటి దాని వలన వచ్చినదే. పరశురాముడు క్షత్రియ విద్వేషి. అందువలన అతడు క్షత్రియులకు విద్య నేర్పడు.బ్రాహ్మణులకు మాత్రమే నేర్పుతాడు. కానీ కర్ణుడు తను బ్రాహ్మణ పుత్రుడని చెప్పుకోవడంతో అతనికి నేర్పాడు.
అది అలా వుంచితే…ఈ పురుగు పేరు "అలర్కము". ఇది తొలవటం వలన కారిన రక్తం తగిలి, పరశురాముడు లేచి ఆ పురుగును గమనించాడు. వెంటనే ఆ పురుగుకు శాప విమోచనం కలిగి త్రాగ్దంశుడు అనే దనుజుడిగా మారి మరణించాడు.
ఆ వెంబడనే, కర్ణుడు తప్పని సరిగా క్షత్రియుడై వుంటాడని, బ్రాహ్మణుడికి ఇలా నిబ్బరంగా బాధను భరించడం రాదని నిర్ధారించుకుని అతనికి నేర్పిన బ్రహ్మాస్త్రం మొదలైనవి ఏవీ అవసర సమయంలో పనికిరావు అని శాపమిచ్చాడు. కర్ణుడి చావుకున్న సవాలక్ష కారణాలలో ఇదొకటి...
2 Comments:
 Anonymous, March 2, 2007 at 1:28 PM